Wednesday, 3 August 2011

గతం


గడిచిన కాలం లో 
నడిచిన మార్గం లో 
ఒంటరైన మైలురాళ్ళు 

రాయి కి రాయి కి మధ్య ముళ్ళ తివాచి
దాటిన తివాచి వెనుక పూల వనం
ప్రతి ముళ్ళు నేర్పెను నా కో పోరాటం
ప్రతి పువ్వు నింపెను నా లో ఆనందం 
పోరాటం నడిపెను నా పాదం
ఆనందం తెలిపెను నా గమ్యం
పాదం కదిలేను గమ్యం వెతుకగా 
గతం మిగిలెను పాఠం నేర్పగా 

Friday, 24 June 2011

నా లో నేను - ప్రధమ వర్ణం

నా ఆలోచనలో నేను 
        తీరం లేని సంద్రం లో అలనైయ్యాను 
నా ఆవేదన లో నేను 
        రాగం లేని గానం లో గీతమయ్యాను
నా ఆవేశం లో నేను 
        అర్థం లేని భావం లో భాషనయ్యాను
నా అయోమయం లో నేను 
        జవాబు తెలియని ప్రశ్నల చివర ప్రశ్నార్ధకమయ్యాను

Friday, 6 August 2010

ఓ మ్రుత్యువా....

ఓ మ్రుత్యువా...........భయమేస్తోంది
అనుకోకుండా దగ్గరికి వచ్చి
అనుబంధాలను దూరం చేసి
అయినవారిని ఒంటరి చేసి
విషపు కోరల పడగ నీడతో కబళిస్తోంటే....భయమేస్తోంది

ఓ మ్రుత్యువా...........జాలేస్తోంది
ఆకలి భాదల వలయం వేసి
నిశ్రుహ నీడల ముసుగును కప్పి 
అందకారపు గది లో తోసి 
విధి పాశం అవిచక్షణ తో ఝాళిపిస్తోంటే....జాలేస్తోంది

ఓ మ్రుత్యువా...........నవ్వస్తోంది
అవివేకపు ఆవేశం నింపి 
అసమర్ధపు వీరత్వం నేర్పి
ఆత్మత్యాగం అర్థం మార్చి
అల్పుల ఆయువు ఫేకిళిస్తోంటే...నవ్వస్తోంది

Tuesday, 3 August 2010

తొలి కిరణం

కటిక చీకటి కమ్ముకోగా
గువ్వ గొంతులు మూగబోగా
కంటి రెప్పలు వాలిపోగ
కలల ద్వారం తెరుచుకోదా !

కన్న కలలే కోరికలుగా
కొత్త ఊపిరి నింపుకోగా  
రేయి పొరలే చీలిపోగా
సుర్యతేజం వెలుగునీయదా !